పాత కంప్యూటర్ ఇకపై కొత్త దానిలా..
పాత ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ తోనే క్లౌడ్ పీసీని ఉపయోగించుకునే సదుపాయాన్ని రిలయన్స్ జియో తీసుకొచ్చింది. ‘జియోపీసీ (JioPC)’ పేరుతో సబ్‌స్క్రిప్షన్ సేవను ప్రారంభించింది. దీని ద్వారా కొత్త హార్డ్‌వేర్ కొనకుండానే పాత ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, టీవీని కూడా క్లౌడ్ ఆధారిత కంప్యూటర్‌గా ఉపయోగించుకోవచ్చు. ఈ సేవ ప్రస్తుతం దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులో ఉంది. జియోపీసీ ఎలా పనిచేస్తుంది? సాధారణ కంప్యూటర్‌లోనే ప్రాసెసింగ్, స్టోరేజ్ వంటి పనులు జరుగుతాయి. అయితే జియోపీసీలో ఎక్కువ కంప్యూటింగ్ పనులు జియో క్లౌడ్‌లో జరుగుతాయి. మన దగ్గర ఉన్న ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కేవలం క్లౌడ్ పీసీని ఉపయోగించుకునే పరికరంగా పనిచేస్తుంది. దీంతో పాత కంప్యూటర్‌లో ర్యామ్, స్టోరేజ్ వంటి...