వెయ్యి రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమి లేదు..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1,000 రోజుల్లో చేసింది ఏమీ లేదని, మిగిలిన 750 రోజుల్లో ఏం చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు. బుధవారం భువనగిరిలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెస్ట్ బెంగాల్ తీరుగా తయారు చేస్తుందని మండిపడ్డారు. కాంగ్రెసోళ్లు రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నాయకులపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేస్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెసోళ్లు బిజెపి నాయకులపై దాడి చేయాలనే కార్యక్రమాలు పెట్టుకున్నారని, ఇటీవల నల్లగొండ జిల్లా అధ్యక్షుడి ఇంటిలోకి...