భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న క్షేత్రం నాంపల్లి

వేములవాడ(సిరిసిల్ల): సింహం నిద్రిస్తున్న తీరుతో ఎంతో మహిమాన్వితంగా, ప్రకృతి అందాలతో నాంపల్లి గుట్ట పర్యాటకులను ఆకర్షిస్తోంది. గుట్ట మధ్య భాగంలో ఐదు తలలతో నిర్మించిన కాళీయమర్థనం, తలపై శ్రీ కృష్ణుడి నృత్య రూపం, చుట్టూ పచ్చని పంటపొలాలు, ఉత్తరాన మూలవాగు అందాలు, దక్షిణాన మానేరువాగు అందాలు, తూర్పున మానేరు వాగు, మూలవాగు కలిసే మధ్యమానేరు డ్యామ్‌ బ్యాక్‌వాటర్‌ వ్యూ భక్తులు, పర్యాటకులను ఇట్టే కట్టి పడేస్తుంది నాంపల్లి గుట్ట. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న నాంపల్లి లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రం శ్రావణ మాసం సందర్భంగా భక్తుల రద్దీతో సందడిగా మారింది. రాజన్న ఆలయానికి వచ్చిన భక్తులు లక్ష్మీనృసింహ స్వామి వారిని దర్శించుకుని అక్కడ విడిది చేస్తేనే...