గుడివాడలో చోరీ కేసును ఛేదించిన పోలీసులు..
జిల్లాలోని గుడివాడలో బంగారం చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దాదాపు 48 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేశారు. గుడివాడ మండలం మోటూరు గ్రామంలో గండికోట శివపార్వతి ఇంట్లో భారీ చోరీ జరిగింది. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. త్వరతగతినే చోరీ చేసిన నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడు మోటూరుకు చెందిన తాడిపర్తి అశోక్‌కుమార్‌గా గుర్తించారు. అతడి వద్ద నుంచి రూ.4.20 లక్షల విలువైన 48 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్ స్టేషన్‌లో బంగారు ఆభరణాలను రికవరీ చేసుకున్నారు.ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీఐ సోమేశ్వరరావు మీడియాకు తెలియజేశారు. రికవరీ చేసిన బంగారు ఆభరణాలను మీడియా...