పాక్ ప్లేయర్ ఇమామ్‌పై పీసీబీ విచారణకు ఆదేశం!

పాకిస్థాన్ క్రికెట్‌లో మరో వివాదం ముదురుతోంది. ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో గాయమని నటించి బ్యాటింగ్‌కు రాలేదని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ చిక్కుల్లో పడ్డాడు. అతడి ఫేక్ ఇంజూరీపై విచారణకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. అవసరమైతే ఇమామ్ న్యాయపరంగా సహాయం తీసుకునే అవకాశముందని సమాచారం. రెండో టెస్టులో ఇమామ్ కండరాలు పట్టేశాయని చెప్పి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బ్యాటింగ్‌కు రాలేదు. ఆ మ్యాచ్‌లో పాక్ ఏకంగా 194 పరుగుల తేడాతో ఓడిపోగా.. మూడు టెస్టుల సిరీస్‌ను ఇంగ్లండ్ 2-0తో కైవసం చేసుకుంది. ఇమామ్ గాయంపై పాకిస్థాన్ సెలక్షన్ కమిటీ సభ్యుడు ఆకిబ్ జావెద్ తీవ్రంగా స్పందించాడు. ఈ...