పులివెందులకు జగన్, ఫ్యామిలీతో కలిసి..

మాజీ సీఎం జగన్ రేపు (మంగళవారం) నుంచి రెండు రోజులు పులివెందులలో పర్యటించే విధంగా షెడ్యూల్ ఖరారు అయింది. సెప్టెంబర్‌ 1న మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరు కుంటారు. అనంతరం భాకరాపురంలోని క్యాంప్‌ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటారు. రాత్రికి పులివెందులలోని తన నివాసంలో బస చేస్తారు. సెప్టెంబర్‌ 2న ఉదయం పులివెందుల నివాసం నుంచి బయలుదేరి ఉదయం 7.45 గంటలకు ఇడుపులపాయ చేరుకొని అక్కడ వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని నివాళులర్పిస్తారు. ఆ తరువాత జగన్‌ అక్కడి నుంచి తిరుగు ప్రయాణం కానున్నారు. తన కుటుంబ...