పాల ధరలు రేపటి నుంచే పెంపు!
ధరల పెంపునకు ప్రధాన కారణాలు పశువల మేత, ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరగడమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణమని ఉత్పత్తిదారులు వెల్లడించారు. గడిచిన ఏడాది కాలంలో ధాన్యం, కంది చుని, శనగ చుని, మొక్కజొన్న, పచ్చి మేత ధరలు దాదాపు 25 శాతం వరకు పెరిగాయి. దీనికి తోడు ఇంధనం, రవాణా, కార్మికుల కూలీ, నిర్వహణ ఖర్చులు కూడా పెరిగాయి. ప్రస్తుతం ఒక లీటరు పాలు ఉత్పత్తి చేయడానికి రూ.98 వరకు ఖర్చు అవుతోందని, పాత రేట్లతో నష్టాలు వస్తున్నాయని వారు వివరించారు. ముంబైలో ప్రతిరోజూ దాదాపు 40 లక్షల లీటర్ల గేదె పాలు విక్రయం అవుతుండటంతో ఈ ధరల సవరణ నిర్ణయానికి సభ్యులందరూ ఏకగ్రీవంగా...