పటిష్ట జట్టుపై పసికూన సంచలనం..
విండ్‌హోక్‌లోని నమీబియా క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన టీ20 ట్రై-నేషన్ సిరీస్ ఆరంభ మ్యాచ్‌లో పసికూన నమీబియా సంచలనం సృష్టించింది. పటిష్ఠమైన దక్షిణాఫ్రికా జట్టుపై 18 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. 164 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీ జట్టును 145/9 స్కోరుకే కట్టడిచేసి ఈ సిరీస్‌లో బోణీ కొట్టింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్‌లలో నమీబియా తమ 2-0 ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది. నమీబియా విజయంలో బౌలర్లు రూబెన్ ట్రంపెల్‌మన్, జేజే స్మిత్ కీలకపాత్ర పోషించి చెరో మూడు వికెట్లు పడగొట్టారు.అంతకుముందు టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ బ్యోర్న్ ఫోర్టుయిన్ బౌలింగ్ ఎంచుకున్నాడు. అయితే నమీబియా ఓపెనర్లు లూరెన్ స్టీన్‌క్యాంప్, జాన్...