భార్య పుట్టింటికి వెళ్లాలంటే భర్త అనుమతి అక్కర్లేదు
వివాహ బంధంలో భార్యపై భర్త ఆధిపత్యం చెలాయించకూడదని కర్ణాటక హైకోర్టు స్పష్టంచేసింది. పెళ్లి చేసుకున్నంత మాత్రాన భార్య ఇంటి పనులు చేయాలి, అత్తమామలను తప్పనిసరిగా చూసుకోవాలి. పుట్టింటికి వెళ్లాలంటే భర్త అనుమతి తీసుకోవాలనే నిబంధన ఏదీ లేదని పేర్కొంది. వివాహం అంటే పరస్పర గౌరవం, నమ్మకం, సమానత్వంతో కొనసాగాల్సిన బంధమని కోర్టు వ్యాఖ్యానించింది. జస్టిస్ చిల్లకూరు సుమలత ధర్మాసనం ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛ, ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన అవసరాన్ని కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. బెంగళూరు రూరల్ జిల్లాకు చెందిన సతీష్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెకు కుటుంబ న్యాయస్థానం నెలకు రూ.9,000 చొప్పున భరణం చెల్లించాలని ఇచ్చిన...