బంధాలకు అనుబంధాలకు వారధి రక్షాబంధన్

ఆత్మీయత అనురాగాలకు ఆర్ద్రత అవగాహనకు బంధాలకు అనుబంధాలకు "రక్ష" కావాలి "రక్షాబంధన్" సోదర భావానికి ఆత్మీయత అనే గంధం అద్దితే కనిపించే సుందర రూపమే రక్షాబంధన్ యుగ యుగాలుగా తర తరాలుగా రాఖీ పౌర్ణమి హిందూ సంస్కృతి ధర్మ రక్షణకు ప్రతిబింబంగా నిలిచింది అన్నదమ్ములకు అక్క చెల్లెలు కట్టే అపురూప ఆత్మీయ బంధాల రక్షణ కవచం "రాఖీ" రాఖీ పండుగ ఆనందాల వెల్లువ అనుబంధాల సందడి అనురాగాల సంఘమం మమతల అనుబంధం పరిమళించే రక్షాబంధన్ ప్రేమను పంచి ఆదరాభిమానాలు చూపే ఆత్మీయ బంధం రక్షాబంధన్ సోదరుడి ఉన్నతికి వాత్సల్య బంధం రక్షాబంధన్ సోదరి రక్షణ సూచించే ప్రమాణం కష్ట నష్టాల్లో కలిమి లేముల్లో కలిసి ఉండేలా...