రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలుకు 50 ఏళ్లు
రాయలసీమ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అత్యంత అరుదైన మైలురాయిని చేరుకుంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవంతంగా 49ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకొని 50వ ఏడాదిలోకి అడుగు పెట్టింది. అర్ధ దశాబ్దం పాటు పేదల బండిగా ఈ రైలుకు పేరుంది. 1977వ సంవత్సరంలో ఈ రైలు ప్రారంభమైంది. అప్పట్లో మీటర్ గేజీ పట్టాలపై సింగిల్ లైన్‌లో సామాన్యులకు అందుబాటులో ఉండేది. కాలక్రమంలో ప్రయాణికుల రద్దీ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ (నాంపల్లి) దక్కన్ నుంచి నిజామాబాద్‌కు పొడిగించారు. ఎక్స్‌ప్రెస్ నుంచి సూపర్ ఫాస్ట్‌గా ఆప్‌గ్రేడ్ చేసి ఆధునిక ఇంజన్లతో ప్రయాణం సాగిస్తోంది. తిరుపతి నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ...