న్యూజిలాండ్‌లో భారత్ టూర్‌కు భారీ క్రేజ్..

ఈ ఏడాది అక్టోబర్ లో టీమిండియా న్యూజిలాండ్ లో పర్యటించనుంది. టీ20, వన్డే, టెస్టు సిరీస్ లో భాగంగా మొత్తం 12 మ్యాచులు జరగనున్నాయి. ఈ క్రమంలో ఇప్పటినుంచే భారీ క్రేజ్‌ కనిపిస్తోంది. న్యూజిలాండ్‌ క్రికెట్‌ అంతర్జాతీయ సీజన్‌ టికెట్‌ విక్రయాలు రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. క్రికెట్‌ నేషన్‌ సభ్యుల ప్రీ సేల్‌ మొదలైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడయ్యాయి.ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌లో జరిగే పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు టికెట్లకు భారీ డిమాండ్‌ ఏర్పడింది. క్రైస్ట్‌చర్చ్‌లోని 9 వేల సీట్ల హాగ్లీ ఓవల్‌కు టికెట్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుత డిమాండ్ ప్రకారం చూస్తే.. అక్టోబర్‌ 22, 24 తేదీల్లో జరిగే తొలి...