విశాఖలో లారీ డ్రైవర్‌పై దాడి ఘటన..

విశాఖలోని షీలానగర్‌లో లారీ డ్రైవర్‌పై దాడి ఘటనలో రవాణాశాఖ ఇన్‌స్పెక్టర్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్‌నూ మల్కాపురం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. విశాఖలో అసిస్టెంట్‌ మోటారు వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పార్వతి ఈ నెల 20వ తేదీన షీలానగర్‌ మారుతీ సర్కిల్‌ వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. అదే సమయంలో ఛత్తీస్‌గడ్‌కు చెందిన ఓ లారీ.. పోర్టు నుంచి లోడ్‌తో వస్తోంది. ఆ లారీని ఇన్‌స్పెక్టర్ పార్వతి ఆపారు.కానీ, లారీ డ్రైవర్ వాహనాన్ని నిలుపకుండా ముందుకు వెళ్లిపోయారు. దీంతో పార్వతి డ్రైవర్ వాహనాన్ని వెంబడించి లారీని అడ్డగించారు. ఆపై లారీ క్యాబిన్‌లోకి ఎక్కి విచక్షణారహితంగా అతడిపై దాడి చేశారు....