వర్షం కారణంగా ముగిసిన నాలుగో రోజు ఆట..
ఇండియా- శ్రీలంక మధ్య, కొలంబో వేదికగా జరుగుతున్న రెండో టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. బుధవారం ఆట ముగిసే సమయానికి శ్రీలంక స్కోరు 229/6గా ఉంది. శ్రీలంక ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంక 16 పరుగుల ఆధిక్యం సంపాదించింది. అయితే, వర్షం కారణంగా ఈ రోజు ఆటను త్వరగా ముగించాల్సి వచ్చింది.క్రీజులో సోనాల్ దినుషా 7 పరుగులతో, కేషర నువాంతా 3 పరుగులతో క్రీజులో ఉన్నారు. బుధవారం ఉదయం శ్రీలంక 265/8 వద్ద తొలి ఇన్నింగ్స్ కొనసాగించింది. ఆ తర్వాత ఐదు ఓవర్లలోనే 290 పరుగులు చేసి, ఆలౌటైంది. దీంతో ఇండియాకు తొలి ఇన్నింగ్స్‌లో 213 పరుగులు ఆధిక్యం లభించింది....