విద్యార్థులకు నాణ్యమైన భోజనంలో రాజీ వద్దన్న మంత్రి శ్రీధర్ బాబు

పేద విద్యార్థుల కడుపు నింపడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు పేర్కొన్నారు. సోమవారం మంథని పట్టణంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ను మంత్రి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి శుభ్రమైన వాతావరణంలో తయారు చేసిన నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ సెంట్రలైజ్డ్‌ కిచెన్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ బాధ్యతలు చేపట్టిన హరే కృష్ణ ఫౌండేషన్‌ ప్రతినిధులకు మంత్రి...