మేల్కో ఓనవతరమా ! విజయాలను చేరుకో

మేలుకో ఓ నవతరమా విజయాలను చేరుకో నిరాశా నిస్పృహల్లో కూరుకుపోకు ఎప్పుడూ ఆందోళనల్లో మునిగిపోకు పోలికల పోటీల బరిలో దిగకు పరుగుల ప్రపంచంలో పడిపోకు ఓయువతరమా గమ్యం చేరే గెలుపులో నిన్ను నువ్వు మరువకు నీ పై నీకున్న నమ్మకాన్ని వీడకు చదువు కొలువు అంటూ విశ్రాంతిని వదల వద్దు యాంత్రికమైన బతుకుతో ఆరోగ్యంపై నిర్లక్ష్యం వద్దు ఆశయాల శిఖరాలను అందుకోవడం నీ హక్కు అలసటతో కూడిన ప్రయాణం ఆరోగ్యానికి చేటని తెలుసుకో రీల్స్ పిచ్చిలో పడి రియాలిటీ మరిచావు లైకుల వేటలో నీ వ్యక్తిత్వాన్ని అమ్ముకున్నావు రీల్స్ కామెంట్స్ చూసి గుండె చెదిరనీయకు స్క్రీన్ వెనుక బతుకు కాదు నీ ప్రయాణం సమాజపు సవాళ్లను...