చక్కెర నిల్వలపై యోగి సర్కార్ కొరడా..
చక్కెర ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో చక్కెర నిల్వలు, సరఫరా పరిస్థితిపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్ష నిర్వహించారు. చక్కెరను అక్రమంగా నిల్వ చేయడం, బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని చక్కెర మిల్లుల్లో ప్రస్తుతం 179.38 లక్షల క్వింటాళ్ల చక్కెర నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో సహకార చక్కెర మిల్లుల్లో 23.60 లక్షల క్వింటాళ్లు, కార్పొరేషన్ మిల్లుల్లో 5.28 లక్షల క్వింటాళ్లు, ప్రైవేటు మిల్లుల్లో 150.50 లక్షల క్వింటాళ్ల నిల్వలు ఉన్నాయి.ఎవరూ 30 రోజులకు మించి చక్కెర నిల్వలు ఉంచకుండా చూడాలని యోగి అధికారులను ఆదేశించారు. ఒకేసారి 400 టన్నులకు మించి...