రాష్ట్రంలో విద్యా కార్యక్రమాలు చేపట్టండి
తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని… లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా ఆయన శుక్రవారం 900 ఏండ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత లండన్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. తెలంగాణతో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్‌నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌ను...