ఢిల్లీలో మళ్లీ నిరసన సెగ..

దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ నిరసన చెలరేగింది. ఇటీవలే విద్యావ్యవస్థలోని అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలతో దేశం అట్టుడికిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నిరసనకారులు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కదం తొక్కారు. జంతర్ మంతర్‌లో 'రిజర్వేషన్ హఠావో' పేరుతో ఆందోళనలు చేపట్టారు. బిహార్, ఉత్తర్‌‌ప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి సుమారు 300 మంది నిరసనకారులు ఇందులో పాల్గొన్నారు. వీరిలో పలువురు రిజర్వేషన్లను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేయగా, కొందరు ఆర్థిక అసమానతల ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించాలన్నారు. సుమారు 5.4 మిలియన్ల ఫాలోవర్లున్న ఓ ఇన్‌స్టాగ్రామ్ పేజీ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగింది. ఆగస్టు 21 తేదీన రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గళం విప్పాలని ఆ...