అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చి మునుపెన్నడూలేని విధంగా ఆంక్షలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెబుతుంటే.. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ స్పష్టం చేసింది. ఆ ఆంక్షలు తమను ఇబ్బంది పెట్టినా.. వాటిని అధిగమిస్తామని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ గాలీబఫ్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు.. ఇరాన్‌పై విధించే ఆంక్షలను త్వరలోనే వెల్లడిస్తామని యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్సెంట్ తెలిపారు. ఆ దేశానికి సాయమందించే ఏ దేశమైనా ఈ ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు.కాగా.. ఆరు నెలలుగా అమెరికా ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు నిరంతరం...