కొండా సురేఖపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. సుస్మిత వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయొద్దని, అది పూర్తిగా ఆమె సొంత అభిప్రాయమంటూ క్రమశిక్షణ కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వ విప్లు బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు బాలు నాయక్, నాయిని రాజేందర్ రెడ్డి స్పందిస్తూ.. కొండా సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుస్మిత వ్యాఖ్యలతో సురేఖకు సంబంధం లేకపోతే ఖండించాలని అన్నారు. సుస్మిత వ్యాఖ్యలపై సురేఖ స్పందించాలి: బీర్ల ఐలయ్య ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు చేయడం మామూలే అని.. సొంత పార్టీ వాళ్లు విమర్శలు చేస్తే...