పోలీస్ శాఖలో కొలువుల జాతర
పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేయగా తాజాగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. ప్రభుత్వం వేల సంఖ్యలో ఖాళీలకు నోటిఫికేషన్ ఇవ్వడంతో నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురించాయి. పలువురు కోచింగ్ సెంటర్‌లకు వెళ్తుండడంతో సందడి మొదలైంది. కమిషనరేట్ పరిధిలో వందల పోస్టులు ఖాళీలు... కమిషనరేట్ పరిధిలో వందల సంఖ్యలో పోలీసు కొ లువులు ఖాళీ ఉన్నాయి. జిల్లాలో ప్రతి సంవత్సరం పో లీసు ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతుంటారు. స్థానికత(లోకల్ కేడర్) ప్రకారం ఖాళీల వివరాలను సంబంధిత శాఖలు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు ఇప్పటికే పంపించినట్లు అధికారులు ప్రకటిం...