మా భూములు ఇవ్వం

కష్టాన్ని నమ్ముకున్న రైతన్నలు తమ భూములే ఆధారంగా జీవిస్తున్నారు. పంటల సాగు ద్వారా ఎందరికో తిండి పెడుతున్న వీరి భూములను పరిశ్రమల పేరుతో ప్రభుత్వం బలవంతంగా గుంజుకుంటుంటే బోరున విలపిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని న్యాల్‌కల్ మండలం మామిడ్గి గ్రామంలో 700 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తారు. ఆ ఊరిలో భూ సేకరణ కోసం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ తప్పుల తడకగా ఉంది. వెయ్యి ఎకరాలకు నోటిఫికేషన్‌ ఇవ్వగా జనరల్ అవార్డు కింద 600 ఎకరాలుగా పేర్కొన్నారు. దీంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వం దొంగసంతకాలతో రైతులు ఒప్పుకున్నారంటూ నోటిఫికేషన్లు వేస్తోంది. దానికి సంబంధించి వివరాలు అడిగితే అధికారులు ఇవ్వడం లేదు....