మంత్రి పొంగులేటికి సవాల్‌..

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి భారీ అవినీతికి తెరలేపారని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంత్రి అవినీతికి సంబంధించి అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పారు. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని, హౌస్ కమిటీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా? అంటూ మంత్రి శ్రీనివాస రెడ్డికి ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిన్న (బుధవారం) సవాల్ చేశారు. తన సవాల్‌ను స్వీకరిస్తే అసెంబ్లీ మీడియా పాయింట్‌కు రావాలని కోరారు. ఈ మేరకు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరుకున్నారు.