కాలువలో చిక్కిన డెవిల్‌ ఫిష్‌

ఉమ్మడి వరంగల్ జిల్లా జఫర్‌గడ్‌ మండల కేంద్రంలో ఓ కాలువలో మత్స్యకార్మికులకు వింతైన చేప లభించింది. గ్రామ చివర కందకం (కాలువ)లో నీరు చేరడంతో బుధవారం మత్స్యకార్మికులు చేపల కోసం వల వేయగా.. అందులో వింత ఆకారంలో ఉన్న చేప చిక్కింది. సాధారణ చేపలకు భిన్నంగా, శరీరంపై గట్టి కవచం లాంటి పొరలు, వింత ఆకారం, ప్రత్యేకమైన నోరుతో ఉన్న చేప చిక్కింది.