ఆన్‌లైన్‌లో అద్దె చెల్లిస్తున్నారా..? అయితే ఈ విషయాల్లో జాగ్రత్త..!
దేశవ్యాప్తంగా ఇప్పుడు డిజిటల్ యుగం నడుస్తోంది. అందరూ డిజిటల్ చెల్లింపులకే అలవాటు పడ్డారు. కారు దగ్గర నుంచి కాఫీ వరకు ఏది కొనాలన్న నగదు రహిత లావాదేవీలనే ఆశ్రయిస్తున్నారు. ఇంటి అద్దెను కూడా ఆన్‌లైన్‌లో చెల్లించడానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇలాంటి చెల్లింపులు క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతాయని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఆన్‌లైన్‌లో అద్దె చెల్లించినంత మాత్రాన క్రెడిట్ స్కోరుకు వాటిల్లే ముప్పేమీ లేదని, కానీ ఈ చెల్లింపులకు సంబంధించిన ఆర్థిక ప్రవర్తన స్కోరుపై ప్రభావం చూపుతుందని రెంటన్‌పే సీఈఓ సారిక శెట్టి తెలిపారు. ఒకవేళ అద్దెను క్రెడిట్‌పై తీసుకుని కడితే, దాన్ని సక్రమంగా తిరిగి చెల్లించాలని సూచించారు. ఈ ప్రక్రియలో ఆలస్యం జరిగితే...