నాలుగు నెలలుగా జీతాల్లేవని టిమ్స్ హాస్పిట‌ల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ధర్నా

నాలుగు నెలలుగా జీతాలు చెల్లించ‌డం లేద‌ని ఆరోపిస్తూ టిమ్స్ హాస్పిట‌ల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుధర్నా చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. సనత్‌నగర్ టిమ్స్ ద‌వాఖాన‌లో నాలుగు నెలలుగా జీతాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు త‌మ‌ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేవారు. ఈమేర‌కు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు టిమ్స్‌ ప్రధాన గేటు ఎదుట ధర్నా నిర్వహించి వెంటనే జీతాలు చెల్లించాలని డిమాండ్ లేదంటే పెద్ద ఎత్తున ఉద్య‌మిస్తామ‌ని హెచ్చ‌రించారు.