ప్రాణంగా చూసుకునే పెంపుడు కుక్క ‘బఘీరా’ మృతి!

టాలీవుడ్ స్టార్ హీరో, మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క ‘బఘీరా’ కన్నుమూసింది. గత నాలుగేళ్లుగా ఎన్టీఆర్ కుటుంబంలో ఒక సభ్యుడిగా కలిసిపోయిన బఘీరా మృతి పట్ల ఆయన తీవ్ర వేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన పెంపుడు నేస్తాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు.‘బఘీరా.. నువ్వు నా ప్రపంచంలోకి ఒక తోడుగా అడుగుపెట్టి, ఎంతో నిశ్శబ్దంగా నా కుటుంబంలో ఒకడిగా మారిపోయావు. ఈ నాలుగేళ్ల కాలంలో నీ ప్రేమ, నమ్మకం, అల్లరితో పాటు నువ్వు మాత్రమే ఇవ్వగలిగే ప్రశాంతతతో నా రోజులను నింపేశావు....