అందుకే బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలో తెలంగాణ‌కు చోటు ద‌క్క‌లే

బీజేపీ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నాయకులకు ప్రాతినిధ్యం దక్కకపోవడంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొనసాగుతున్న వర్గ రాజకీయాలే దీనికి ప్రధాన కారణమని ఆరోపిస్తూ రాష్ట్ర నేతలంతా తమ వైఖరిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని అన్నారు. గతంలో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలకు జాతీయస్థాయిలో కీలక పదవులు దక్కేవని, కానీ ఈసారి ఒక్కరికి కూడా జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించలేదని రాజాసింగ్ అన్నారు. తెలంగాణ బీజేపీలో నిరంతరం గ్రూప్ రాజకీయాలు నడుస్తున్నాయని, ప్రతి చిన్న విషయానికీ ఢిల్లీకి వెళ్లి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునే సంస్కృతి పెరిగిపోయిందని రాజాసింగ్ విమర్శించారు. నాయకుల మధ్య ఉన్న ఈ తీవ్ర విభేదాల వల్లే ‘తెలంగాణ నేతలు...