వడ్డెర కులాన్ని తక్షణమే ఎస్టీ జాబితాలో చేర్చాలి
వడ్డెర సంఘం దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు ఇరగదిండ్ల కృష్ణ డిమాండ్. దేవరకొండ 18ఆగస్టు (BVK 3 న్యూస్ ) : ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర వెనుకబాటుతనానికి గురైన వడ్డెర కులస్తులను వెంటనే ఎస్టీ జాబితాలో చేర్చాలని నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ వడ్డెర సంఘం అధ్యక్షులు ఇరగదిండ్ల కృష్ణ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత 40 సంవత్సరాలుగా వడ్డెర కులస్తులు తీవ్రమైన పేదరికంలో జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాళ్ళు కొట్టడం, కంకర కొట్టడం, ప్రాజెక్టుల్లో కఠినమైన కూలీ పనులు చేసుకోవడం తప్ప తమకు ఎలాంటి భూములు,...