భోగాపురం ఎయిర్‌పోర్టుకు తొలి విమానం రాక..

భోగాపురం ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు ప్రారంభం కావడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. చరిత్రాత్మక ఘట్టానికి భోగాపురం వేదికైందన్నారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో నేటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని తెలిపారు. హైదరాబాద్‌ నుంచి తొలి ఇండిగో విమానం భోగాపురం విమానాశ్రయానికి చేరుకుందన్నారు. తొలి విమానం రాకతో ఏపీ.. కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఉత్తరాంధ్రకు మెరుగైన విమాన కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.