మేడారంలో వనదేవతలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు
- చేయూత పింఛన్ల చెక్కుల పంపిణీ,వాటర్ ప్లాంట్ ప్రారంభం - మహిళా సంఘాల సభ్యులతో ముఖ్యమంత్రి ముచ్చట ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 16(బీవీకే న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ములుగు జిల్లాలోని ప్రముఖ గిరిజన పుణ్యక్షేత్రం మేడారంలో పర్యటించారు. కామారెడ్డి జిల్లా బిచ్కుంద నుండి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారం చేరుకున్న ముఖ్య మంత్రికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు,ఉన్నత అధికారులు ఘన స్వాగతం పలికారు.ఆలయ ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి గిరిజన పూజారులు సాంప్రదాయ డోలు వాయిద్యాలు,గిరిజన సంప్రదాయాల నడుమ ఘనంగా స్వాగతం పలికారు.మేడారంలోని వనదేవతలు సమ్మక్క - సారలమ్మల గద్దెలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతో...