గంగా నదిలో పెరిగిన నీటి ప్రవాహం..
యూపీ, వారణాసి పరిధిలోని గంగానదిలో నీటి ప్రవాహం భారీగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో నదిలో బోటు సర్వీసుల్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. భారీ నీటి ప్రవాహాన్ని, సందర్శకుల క్షేమాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు వాటర్ పోలీస్ ఉన్నతాధికారులు ఏసీపీ దశాశ్వమేధ, డా.అతుల్ అంజాన్ త్రిపాఠిలు ప్రకటన జారీ చేశారు. బోటు నిర్వాహకులకు దీనిపై తగిన సూచనలు చేశారు.బోటు సేవల్ని నిలిపివేయడంపై అధికారులు మీడియాకు వివరించారు. శనివారం ఉదయం నాటికి గంగానదిలో 64.70 మీటర్ల నీళ్లున్నాయి. ఈ నీళ్లు గంటలకు 6 సెంటీమీటర్ల మేర పెరుగుతున్నాయి. ఇది ప్రమాదకరమైన లోతు. నీటి ప్రవాహం కూడా ఎక్కువగానే...