తల్లి, కొడుకు కలిసి మూడు హత్యలు!

దుబ్బాకలో వరుస హత్యల మిస్టరీని సిద్దిపేట పోలీసులు ఛేదించారు. బంగారం, డబ్బు కోసం తల్లీకొడుకులు కలిసి మహిళలను టార్గెట్‌ చేసి హత్యలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఇప్పటివరకు రెండు హత్యలు చేసినట్లు నిర్ధారించిన పోలీసులు.. గతంలో జరిగిన మరో దోపిడీ కేసును కూడా ఛేదించారు. అంతేకాకుండా మరో నలుగురిని హతమార్చేందుకు ఈ ముఠా టార్గెట్‌ చేసుకున్నట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిందితురాలు చాకలి రజిత (38)ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఆమెతో కలిసి నేరాలకు పాల్పడిన బాలుడిని జువైనల్‌ హోమ్‌కు తరలించారు. సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మీ పెరుమాళ్‌ ఐపీఎస్‌ ఆదివారం కేసు వివరాలను వెల్లడించారు. కాలిన...