రేషన్ కార్డులపై రేవంత్, ఉత్తమ్ ఫొటోలు ఎందుకు..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అబద్ధాలతో కూడుకున్నవని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజాధనంతో సభలు నిర్వహించి కేసీఆర్, హరీశ్‌రావుపై వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప రాష్ట్రానికి ఉపయోగపడే ఒక్క అంశాన్నీ సీఎం ప్రస్తావించలేదన్నారు.కేసీఆర్ ‘అపర భగీరథుడి’లా ఇంటింటికీ తాగునీరు అందించారని తెలిపారు. మిషన్ భగీరథను నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్‌రెడ్డిదేనని ఆరోపించారు. రేవంత్‌రెడ్డికి రాష్ట్ర అభివృద్ధిపై ఎలాంటి విధానం లేదని, బూతులు మాట్లాడటం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని చేయడం లేదని విమర్శించారు.రేషన్ కార్డుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు....