మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా "హర్ ఘర్ తిరంగా" వేడుకలు
దేవరకొండ 14ఆగస్టు (BVK 3 న్యూస్ ) : మునగాల కొండలరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్), దేవరకొండలో ఎన్ సి సి & ఎన్ఎస్ఎస్ విభాగాల ఆధ్వర్యంలో "హర్ ఘర్ తిరంగా" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. వందేమాతర గీతాన్ని ఆలపించి దేశభక్తి నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రామావత్ రవి మాట్లాడుతూ దేశంలోని పౌరులందరూ తమ తమ ఇళ్ల పైన జాతీయ జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటుతూ మన దేశ ఐక్యమత్యాన్ని ప్రపంచానికి సాటి చెప్పాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్సిసి సిటిఓ & వైస్ ప్రిన్సిపాల్ జి. కోటయ్య అకాడమిక్ కోఆర్డినేటర్ సి.లింగమయ్య, కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్...