సంక్షోబాల నుండి సమృద్ధివైపు
(ఆగస్టు 15 భారత దేశ 80 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా రాసిన కవిత) ఎనిమది శతాబ్దాల స్వాతంత్ర్య భారత్ ప్రగతి భాటలో సాగుతున్న వేళ పలు సంక్షోభాల వలయంలో దేశం చిక్కుకుపోయింది పేదరికం నిరుద్యోగం ద్రవ్యోల్బణం ఆర్థిక మాంద్యం ధరల పెరుగుదల ఆకలి కేకలు దేశ ప్రగతిని వెక్కిరిస్తున్నాయి వ్యవసాయరంగం కుదేలైంది గిట్టుబాటు ధరలు లేక మార్కెట్లో దళారుల దోపిడి పెరిగింది రైతాంగం అప్పుల ఊబిలో చిక్కుకొని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు నైతిక విలువలు క్షీణించాయి ప్రాంతీయ మత విద్వేషాలు సామాజిక శాంతికి భంగం కలిగించే సంఘటనలు ప్రకృతి వైపరీత్యాలు ఒక వైపు మానవ తప్పిదాలు మరో వైపు పోటీ పడి కాలుష్యాన్ని పెంచుతున్నాయి సంక్షోభాలను...