నేదునూరి పిలుపు

రేపటి భారతం మన చేతుల్లో (ఆగస్ట్15వ తేదీ' 80వస్వాతంత్ర భారత్ దినోత్సవం సందర్భంగా రాసిన కవిత) 8దశాబ్దాల భారత్ అనేక సమస్యలతో కూరుకుపోయింది శాస్త్ర సాంకేతికత ఆర్థిక రంగంలో అంతరిక్షంలో అగ్రశేణి స్థాయికి ఎదిగింది పేదరికం నిరుద్యోగం సమాజ ప్రగతికి అవరోధమైంది రెక్కాడితే డొక్కాడని బతుకులు మారాలి స్వశక్తితో యువత ఆర్థికరంగంలో ఎదగాలి సామాజిక ఆర్థిక విద్య వైద్య ఉపాధి అవకాశాలు విస్తరించాలి ప్రజల జీవన ప్రమాణాలు మారాలి స్వయం ఉపాధి మార్గంగా పేదరికంపై కలిసి కట్టుగా పోరాడుదాం దేశ స్థితిని గతిని మార్చుదాం బాలకార్మికులు లేని భారతాన్ని నిర్మిద్దాం బాలలు పనిలో ఉండద్దు బాలలను బడి బాట పట్టిద్దాం వారికి బంగారు భవిష్యత్తు నిద్ధాం...