జయశంకర్ భూపాలపల్లిలో క్షుద్రపూజల కలకలం..

జిల్లాలోని మహాదేవపూర్ మండలం కుదురుపల్లి వాగులో క్షుద్రపూజల కలకలం రేగింది. నిన్న(బుధవారం) రాత్రి అమావాస్య కావడంతో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వాగులో క్షుద్రపూజలు చేశారు. నల్లకోడి, నిమ్మకాయలు, కోడి గుడ్డు, పసుపు, కుంకుమతో క్షుద్రపూజలు చేశారు. ఈరోజు(గురువారం) ఉదయం వాగు వద్దకు వెళ్లిన కొందరు గ్రామస్థులు.. క్షుద్రపూజలు జరిగినట్లు గుర్తించారు. విషయం తెలిసిన గ్రామ ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారు.