యువతరం _ ప్రగతి రథ సారథులు
(నవ నైపుణ్యాలతో యువతకు ఉపాధి) (ఆగస్ట్12 అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా) "భారత దేశ భవిష్యత్తును మార్చ గలిగేది యువత" _స్వామి వివేకానంద ఒక్క దేశం యొక్క భవిష్యత్తు ఆ దేశ యువతపైన ఆధారపడి ఉంటుంది. స్వామి వివేకానంద అట్లు నాకు వందమంది శక్తివంతమైన యువకులని ఇవ్వండి నేను ఈ దేశ స్వరూపాన్ని మార్చేస్తాను అంటాడు. ప్రస్తుత ఆధునిక సమాజంలో అంతర్జాతీయ యువజన సంవత్సరానికి జరుపుకుంటున్న తరుణంలో రాజకీయాలలో యువత పాత్ర ప్రాధాన్యతను సంతరించుకుంది. నేటి యువత కేవలం ఓటర్లు గానే కాకుండా రేపటి పాలకులుగా మార్చవలసిన సమయం ఆసన్నమైంది. 2026 అంతర్జాతీయ యువజన దినోత్సవం యొక్క అధికారిక థీమ్ భిన్నమైన సందర్భాలు ఉమ్మడి ఆకాంక్షలు(...