ఈనెల 15న ములుగు జిల్లాకు రానున్న సిఎం రేవంత్ రెడ్డి

- 16న ములుగు జిల్లా కలెక్టరేట్ ను ప్రారంభించనున్న సిఎం రేవంత్ రెడ్డి - సిఎం పర్యటనకు ముందు ములుగు జిల్లాలో పర్యటించనున్న డిజిపి ములుగు జిల్లా ప్రతినిధి, ఆగస్టు 06 (బీవీకే న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈనెల 16న ములుగు జిల్లాకు రానున్నారు.ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.15వ తేదీ సాయంత్రం మేడారం చేరుకొని,రాత్రి అక్కడే బస చేసి..మరుసటి రోజు ఉదయం వనదేవతల సన్నిధిలో పూజలు నిర్వహించి ములుగు జిల్లా కేంద్రానికి చేరుకోనున్నట్లు తెలిసింది.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ములుగు జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న జిల్లా సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయం(నూతన కలెక్టరేట్ భవనం),ములుగు మండలంలోని ఇంచర్ల సమీపంలో నిర్మించిన ఇందిరా...