TGSRTC రిక్రూట్‌మెంట్‌.. డ్రైవర్, శ్రామిక్ పోస్టుల రిజల్ట్స్ విడుదల

TSRTC డ్రైవర్, శ్రామిక్ పోస్టుల నియామకానికి సంబంధించిన తుది ఎంపిక ఫలితాలను తెలంగాణ పోలీసు నియామక మండలి (TGPRB) విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల జాబితాతో పాటు కేటగిరీ వారీగా కట్‌ఆఫ్ మార్కులను కూడా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. గత ఏడాది సెప్టెంబర్ 17న మొత్తం 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయగా, నియామక ప్రక్రియ అనంతరం 1,604 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు మండలి ప్రకటించింది. పోస్టుల వారీగా ఎంపికలు డ్రైవర్ పోస్టులు: 1,000 ఎంపికైన అభ్యర్థులు: 894 మంది శ్రామిక్ పోస్టులు: 743 ఎంపికైన అభ్యర్థులు: 710 మంది డ్రైవర్ పోస్టులకు హాజరైన అభ్యర్థులు తమ డ్రైవింగ్ టెస్ట్ మార్కుల వివరాలను...