భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం..

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. రెండు రోజుల వ్యవధిలోనే సుమారు 50 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. శుక్రవారం అర్ధరాత్రి 53 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం శనివారం ఉదయానికి 55.1 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించింది. జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్ వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి, లోతట్టు ప్రాంతాల ప్రజలను వెంటనే సురక్షిత పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. భద్రాచలం – వెంకటాపురం మార్గంలో రహదారిపైకి వరద నీరు చేరింది. దీంతో భద్రాద్రి ఏజెన్సీలోని వివిధ...