గోదావరి వరదల మధ్య గర్భిణిని సురక్షితంగా తరలించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం

ములుగు జిల్లా ప్రతినిధి, జూలై 31(బీవీకే న్యూస్): గోదావరి నది వరదల కారణంగా రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో ప్రసవ వేదనతో బాధ పడుతున్న ఓ గర్భిణిని ఎన్డీఆర్ఎఫ్ బృందం పడవ ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించింది.వరద నీటి కారణంగా రోడ్డు మార్గం పూర్తిగా తెగిపోవడంతో గర్భిణిని అత్యవసరంగా వైద్యసేవలుఅందించేందుకు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక పడవలో నదిని దాటించారు.అనంతరం ఆమెను 108 అంబులెన్స్ ద్వారా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ..వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు,అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారికి ప్రాధాన్యత ఆధారంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వరద నీటిలోకి...