అమెజాన్ ప్రైమ్‌లోకి ‘పోలీస్ కంప్లైంట్’..
థియేటర్లలో తనదైన మార్కుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైవిధ్యమైన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత బాలకృష్ణ మహారాణా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. గత జూన్ నెలలో తెలుగు మరియు కన్నడ భాషల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. IMDb వంటి ప్రముఖ సినీ రేటింగ్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు డిజిటల్ మీడియాలోనూ సంచలన రేటింగ్‌లు, సానుకూల సమీక్షలు అందుకని ఐకానిక్ హిట్ సాధించిన...