అసోంలో ఎడతెగకుండా కురుస్తున్న వర్షాలు..
అసోం (Assam) లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు (Heavy Rains) తీవ్ర వినాశనాన్ని సృష్టిస్తున్నాయి. నదులన్నీ ఉగ్రరూపం దాల్చి ప్రమాద హెచ్చరిక స్థాయిలను దాటి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో వరద పరిస్థితి అత్యంత విషమంగా మారింది. వేలాది మంది ఇళ్లను వదిలి దిక్కుతోచని స్థితిలో చిక్కుకుపోయారు. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లోనే నలుగురు చిన్నారులతో సహా 10 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఈ వర్షాలు, వరదల కారణంగా సంభవించిన మొత్తం మరణాల సంఖ్య 41కి చేరుకుంది. తాజా మరణాల్లో శివసాగర్ జిల్లాలో ముగ్గురు, జోర్హాట్లో ముగ్గురు, చరైడియో జిల్లాలో ఇద్దరు, ధేమాజీ,...