ఆర్థిక అక్షరాస్యతపై ప్రజలకు అవగాహన కల్పించాలి’
కొత్తగూడెం, జూలై 21 : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మార్గదర్శకాల మేరకు ఏర్పాటు చేసిన సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ (CFL) ఆధ్వర్యంలో కొత్తగూడెం ఆర్బీఓ పరిధిలోని సీఎఫ్‌ఎల్ ప్రతినిధులు, సీఎస్‌పీలతో సోమవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తగూడెం రీజినల్ మేనేజర్ పిజిఎన్ శర్మ మాట్లాడుతూ.. సీఎఫ్‌ఎల్‌లు, సీఎస్‌పీలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక అక్షరాస్యతను పెంపొందించడంతో పాటు బ్యాంకింగ్ సేవల వినియోగాన్ని మరింత విస్తరించే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అటల్ పెన్షన్ యోజన...