సెన్సరీ బేస్‌లైన్ రీసెట్ అంటే ఏమిటి.. మానసిక సమస్యలకు ఇది ఎలా పనిచేస్తుంది..?
ప్రస్తుతం వేగవంతమైన జీవనశైలి, నిరంతర స్క్రీన్ వినియోగం, పని ఒత్తిడి, శబ్ద కాలుష్యం వంటి కారణాలతో చాలామంది మానసిక అలసట, ఆందోళన, ఏకాగ్రత లోపం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. రోజంతా మెదడుపై పడే అధిక ఇంద్రియ ప్రేరణ (సెన్సరీ స్టిమ్యులేషన్) నాడీ వ్యవస్థను తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నాడీ వ్యవస్థకు విశ్రాంతి కల్పించే సెన్సరీ బేస్‌లైన్ రీసెట్ అనే సులభమైన పద్ధతి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతతను పెంచడంలో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రోజంతా కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు, ట్రాఫిక్ శబ్దాలు, నిరంతర మల్టీటాస్కింగ్ వంటి కారణాలతో మెదడు ఒకేసారి అధిక సమాచారాన్ని స్వీకరిస్తుంది. దీంతో శరీరం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండే...