ప్రజలను రెచ్చగొట్టి బతికిన చిల్లర జాతి మాది కాదు.. సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ ఫైర్
ఎన్నికల ముందు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు రైతు డిక్లరేషన్ గురించి ఇచ్చిన అబద్ధపు హామీల వీడియోను ప్లే చేశారు. ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు చేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పంట కొనకపోవడం వల్ల గోడ కూలి ప్రాణాలు కోల్పోయిన నలుగురు రైతుల కుటుంబాలకు కేటీఆర్ ఆర్థిక సాయం అందించారు. మే 6న లక్షెట్టిపేట మండలంలో పంటలు కాపాడుకునేందుకు వెళ్లి మృత్యువాత పడిన నలుగురు రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల ఆర్థికసాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఒక్కటే చిల్లర...