పిల్ల‌ల‌ను రెచ్చ‌గొట్ట‌వ‌ద్దు.. వారికి స‌రైన మార్గాన్ని చూపండి

నీట్ యూజీ పేప‌ర్ లీకేజీ అంశం ఇటీవ‌ల దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన విష‌యం తెలిసిందే. ఢిల్లీలోని జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద కాక్రోచ్ జ‌న‌తా పార్టీ కార్య‌క‌ర్త‌లు భారీ ధ‌ర్నా చేప‌ట్టారు. సోమ‌వారం జ‌రిగిన పార్ల‌మెంట్ మార్చ్ కూడా ఉద్రిక్తం అయ్యింది. ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని మోదీ(PM Modi) ఆ అంశంపై స్పందించారు. పేప‌ర్ లీకేజీల‌కు పాల్ప‌డిన వారికి క‌ఠిన శిక్ష‌ణ‌ను అమ‌లు చేయాల‌న్నారు. పేప‌ర్ లీకేజీ ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసుకోవ‌డం దేశ బాధ్య‌త‌గా భావించాల‌ని ప్ర‌ధాని అన్నారు. ఇవాళ ఎన్డీఏ ఎంపీల‌తో జీఎంసీ బాల‌యోగి ఆడిటోరియంలో జ‌రిగిన మంగ‌ల్ మిల‌న్ భేటీలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసిన‌ట్లు కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. దోష‌ర‌హిత...